Thursday, August 16, 2018

English lessons -12 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu

Telugu English
నువ్వు ఏం చేస్తున్నావు ? What are you doing?
Simple Present మరియు Present Continuous లో ప్రశ్నలు తయారు చేయడం  to make questions in Simple Present and Present Continuous Tense
   
అనుజ్, నువ్వేం చేస్తున్నావు? What are you doing, Anuj?
నేను గది శుభ్రపరస్తున్నాను. I’m cleaning my room. 
నువ్వు కూడా గదిని శుభ్రపరస్తున్నావా? Are you also cleaning your room?
లేదు, నేను నా బట్టలు అల్మారాలో పెడుతున్నాను. No, I’m keeping my clothes in the cupboard.
నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటున్నావా ? Do you want to go out?
అవును నేను బయటకు వెళ్ళాలనుకుంటున్నాను.  Yes, I want to go out. 
నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు ? Where do you want to go?
నేను పార్క్ కు వెళ్ళాలనుకుంటున్నాను.  I want to go to the park. 
సరే, ప్రియ ఎక్కడుంది ? Ok. Where is Priya? 
ఆమె చదువుతోందా ? Is she studying? 
లేదు ఆమె చదవటం లేదు.  No, she is not studying.  
ఆమె ఏంచేస్తోంది ? What is she doing?  
ఆమె స్కూలుకు వెళ్ళటానికి తయారవుతోంది. She is getting ready to go to school.  
సరే. Ok.
   
 విషయాన్ని అర్థం చేసుకోవడం. UNDERSTANDING CONCEPTS
 ' Simple Present Tense' లో ప్రశ్నలు  Questions In Simple Present Tense
తరుచుగా లేదా మళ్ళీ మళ్ళీ జరిగే పనుల గురించి అడగటానికి దీన్ని వాడుతారు. It is used to ask about those actions that are repeated or  that happen usually.
నువ్వు పళ్ళు తింటావా ? Do you eat fruits? 
నీవు ఏ సమయానికి నిద్రలేస్తావు? What time do you wake up?
రోహన్ పియానో వాయిస్తాడా ? Does Rohan play piano?
గమనించండి ‘Do’మరియు ‘Does’ లను ఉపయోగించి ప్రశ్నలు తయారు చేసేటప్పుడు eat, wake, play లతో పాటు ‘ing’ని వాడకూడదు  Please note that "ing" is not used after the verbs while using "do" or "does" in making questions.
Present Continuous లో ప్రశ్నలు Questions in Present Continuous Tense
దీన్ని ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి ప్రశ్నలు అడగటానికి ఉపయోగిస్తారు. It is used to ask about those actions that are in progress. 
వాళ్ళు మార్కెట్ కు వెళుతున్నారా? Are they going to the market?
సోనం చదువుకుంటోందా ? Is Sonam studying?
నువ్వు చెట్లను ఎందుకు నరుకుతున్నావు? Why are you cutting trees?
నీ స్నేహితులు ఫుట్ బాల్ అడుతున్నారా? Are your friends playing football?
Present Continuous  ప్రశ్నలలో 'ing' తో కూడిన వర్బ్ ను వాడాలి. Please note that in Present Continuous questions, ‘ing’ is used with verb. 
వాళ్ళు నిద్రపోతున్నారా? Are they sleeping?
రోహన్ ఈతకొడతాడా? Does Rohan swim?
నీ స్నేహితులు చదువుకుంటున్నారా? Are your friends studying?
మీ తమ్ముడు/అన్న పాడతాడా? Does your brother sing?
నీవు టీ తాగుతావా? Do you drink tea?
రాహుల్ టీ తాగుతాడా? Does Rahul drink tea?
నువ్వు ఏం చేస్తున్నావు ? What are you doing?
మీ అక్క/చెల్లెలు పాడుతోండా? Is your sister singing?
నువ్వు ఏంతింటావు ? What do you eat?
నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు ? Why are you sleeping?

No comments:

Post a Comment