Thursday, August 16, 2018

English lessons -8 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu

Telugu English
రోహన్ కొత్త స్కూలు Rohan's new school
Always, never, seldom లాంటి పదాలను ఉపయోగించడం.  Using words like always, never, seldom
నీ కొత్త స్కూలు ఎలా ఉంది, రోహన్ ? How is your new school, Rohan? 
బాగుంది. నాకు నచ్చింది.  Good. I like it.
నువ్వు స్కూలుకు ఎలా వెళతావు ? How do you go to school?
మా నాన్న తరుచూ నన్ను వదిలిపెడతారు. My father often drops me.
నువ్వు స్కూలుకు ఎప్పుడైనా లేటుగా వెళతావా ? Do you ever go late to school?
చాలా అరుదుగా నేను స్కూలుకు లేటుగా వెళతాను. I rarely go late to school?
నువ్వు క్లాస్ లో ఎక్కడ కూర్చుంటావు ? Where do you sit in the class? 
మాములుగా నేను ముందు కూర్చుంటాను. I usually sit in front.
మీ క్లాస్ లో మాములుగా నువ్వు ఏ భాష మాట్లాడతావు? Which language do you usually speak in class? 
నేను ఎప్పుడూ ఇంగ్లీషే మాట్లాడతాను. I always speak English. 
మీ టీచర్లు నిన్ను ఎప్పుడైనా కోప్పడతారా ? Do your teachers ever get angry with you?
లేదు, మా టీచర్లు నా మీద ఎప్పుడు కోప్పడరు . No, my teachers never get angry with me. 
నీకు పరీక్షలో మంచి మార్కులు వస్తాయా ? Do you get good marks in the exam?
అవును, నాకు తరుచూ మంచి మార్కులు వస్తాయి. Yes, I often get good marks.
దీపక్ ఎప్పుడూ పెయింటింగ్ పోటీలో గెలుస్తాడు. Deepak always wins the painting competition.
రాం తండ్రి సాధారణంగా ఆఫీసుకు కారులో వెళతాడు. Ram's father usually goes to office by car.
మా అన్న/తమ్ముడు నెలకొక సారి ముంబై వెళ్తాడు.  My brother visits/ goes to Mumbai once a month.
ప్రియ రోజుకు రెండుసార్లు మందులు తీసుకుంటుంది. Priya takes medicine twice a day.
నేను గుడికి రోజూ వెళ్తాను. I go to the temple every day. 

No comments:

Post a Comment