Thursday, August 16, 2018

English lessons -2 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu

Telugu English 
ఇతరుల గురించి మాట్లాడుకోవడం  Discuss more about others
‘do not’ మరియు ‘does not’ లను ప్రయోగించడం Using "don't" and "doesn't"
వీళ్ళు మా పొరుగింటివాళ్ళు - మానవ్, పూజ They are my neighbours – Manav and Pooja.
మానవ్ మాల్ లో పనిచేస్తున్నాడు, ఇక పూజ ఫ్రెంచ్ భోధిస్తుంది. Manav works in a mall while Pooja teaches French.
మానవ్ ఉదయాన్నే టీ తాగుతాడు కానీ పూజ తాగదు. Manav drinks tea in the morning but Pooja doesn’t.
పూజ ఉదయాన్నేవాకింగ్ కి వెళుతుంది కానీ మానవ్ వెళ్ళడు.   Pooja goes for a walk in the morning but Manav doesn’t. 
అతను జిమ్ కి వెళతాడు.  He goes to the gym.
వాళ్ళ పిల్లలకి మామిడిపళ్ళంటే ఇష్టం, కానీ వాళ్ళకిష్టం లేదు.  Their kids like mangoes but they don’t.
మేము వాళ్ళింటికి వెళ్ళినప్పుడు చదరంగం ఆడతాం.  We play chess when we go to their home.
పూజ మాతో ఫ్రెంచ్ లో మాట్లాడుతుంది కానీ మాకర్థం కాదు. Pooja tries to talk to us in French but we don’t understand.
నేను ఫ్రెంచ్ నేర్చుకోవాలనుకుంటున్నాను కానీ నాకు సమయం దొరకడం లేదు. I want to learn French but I don’t get time.
వాళ్ళు ఉండేది ఇక్కడ కాదు.  They don't live here.
అమిత్ ఎక్కువగా మాట్లాడడు. Amit doesn't talk much.
మా అక్కకి/చెల్లెలికి పిజ్జా ఇష్టం లేదు.  My sister doesn't like pizza.
నేను ఫిల్మ్స్ చూడను. I don't watch films.
మేము తొందరగా పడుకోము. We don't sleep early.

No comments:

Post a Comment