Thursday, August 16, 2018

English lessons -21 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu

Telugu English
గతాన్ని గురించి మాట్లాడటం Talking about the past.
సామాన్య భూత కాలం - రెగ్యులర్ వెర్బ్స్  Simple Past Tense - Regular verbs
   
ప్రఖ్యాత దర్శకుడు రితూపర్నో ఘోష్ పోయిన నెలలో చనిపోయాడని తెలుసా ? Do you know the famous director Rituparno Ghosh died last month?
అవును, నాకు తెలుసు. Yes, I know. 
అతని సహచరులు అతన్ని 'రితూ దా' అని పిలిచేవారు. His colleagues called him ‘Ritu da’. 
అతను కోల్ కతా లో జన్మించాడు. He was born in Kolkata. 
అతను  కోల్ కతా లోనే చదువు కూడా పూర్తి చేసాడు. He also studied in Kolkata. 
అతను తన కెరీర్ ని అడ్వర్టైజింగ్ ప్రపంచంలో మొదలు పెట్టాడు. He started his career in the advertising world.  
అతను ఎన్నో ప్రజాదరణ కల అడ్వర్టైజ్ మెంట్లను సృష్టించాడు. He created many popular advertisements.    
ఆ తరువాత అతను చిత్రాలకు దర్శకత్వం వహించడం మొదలుపెట్టాడు. He started directing films thereafter. 
వాటిలో పన్నెండింటికి అతను జాతీయ అవార్డుల్ని అందుకున్నాడు. He received the National Award for 12 of them. 
అతనొక టాలెంట్ కలిగిన నటుడు కూడా. He was also a talented actor.  
అవును. అతను తన సినిమాల్లో కొన్నిట్లో నటించాడు కూడా. Yes. He also acted in some of his movies.   
ప్రజలు అతని నటనను ఇష్టపడేవారు, అలాగే పొగిడే వారు. People liked and also praised his acting. 
అతనో నిజమైన కళాకారుడు. He was a true artist.    
   
నేను సాకేత్ లో నివసించాను. I lived in Saket.
అతను తలుపు తెరిచాడు/ ఆమె తలుపు తెరిచింది. He/ She opened the door.
వాళ్ళు హోటల్లో బస చేసారు. They stayed in a hotel.
నేను పార్టీని ఎంజాయ్ చేసాను. I enjoyed the party.
వాళ్ళు పార్కులో ఆడుకున్నారు. They played in the park.

No comments:

Post a Comment