Thursday, August 16, 2018

English lessons -28 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu

Telugu English
సాయాన్ని అందించడం Offering a helping hand
will/ will not లని ప్రయోగించడం using 'will / will not'
   
నువ్వు ఏం చేస్తున్నావు ? What are you doing?
నేను మొక్కలను చూసుకుంటున్నాను. I am taking care of the plants.
సరే. నేను నీకు సాయం చేస్తాను. Ok. I will help you.
నేను ఇప్పుడు మొక్కలకి నీళ్ళు పోస్తాను. I will water the plants now. 
దాన్లో నువ్వు నాకు సాయం చేయచ్చు. You can help me with it.
సరే. మీ గార్డెన్ లో ఏయే మొక్కలు ఉన్నాయి ? Ok. Which plants are there in your garden?
ఇప్పుడు నా గార్డెన్ లో గులాబీ మొక్కలు ఉన్నాయి. There are rose plants in my garden now.
నేను త్వరలో పొద్దుతిరుగుడు పూలను పెంచుతాను.  I will also grow sunflowers soon.
నువ్వు పళ్ళ మొక్కలని ఎందుకు పెంచకూడదు ? Why don’t you grow fruit trees?
నేను పళ్ళ మొక్కలని పెంచను, ఎందుకంటే అవి పక్వం చెందడానికి చాలా ఏళ్ళు పడుతుంది. I will not grow fruit trees because they will take many years to mature.
నేను నా తోటలో ఒక మామిడి చెట్టును పెంచుతాను. I will grow a mango tree in my garden.
ఎందుకు ? Why ?
మామిడి నాకు అత్యంత ఇష్టమైన పండు. Mango is my favourite fruit. 
నేనొక మామిడి చెట్టుని పెంచుతాను, దాంతో సంవత్సరమంతా మామిడిపళ్ళను తినచ్చు. I will grow a mango tree so that I can eat mangoes throughout the year. 
నేను కూడా నీ చేట్టునుంచీ మామిడి పళ్ళు తింటాను.   I will also eat the mangoes from your tree.
సరే, నేను ఇంటికి వెళుతున్నాను. Fine, I am going home now.
సరే. నేను నిన్ను స్కూలులో కలుస్తాను. Ok. I will meet you in school tomorrow.
   
మనం అక్కడికి సమయానికి చేరుకుంటాం. We will reach there on time.
నేనొక డాక్టర్ ని అవుతాను. I will become a doctor.
నేను ఈ పుస్తకాన్ని చదువుతాను. I will read this book.
మనమొక మూవీ చూద్దాం. We will watch a movie.
మనం ఈరోజు రాత్రి బయట తిందాం. We will eat out tonight.
   

No comments:

Post a Comment