Thursday, August 16, 2018

English lessons -23 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu

Telugu English
నేను ఈరోజు స్కూలుకు వెళ్ళలేదు. I didn't go to the school today.
సామాన్య భూతకాలం - “did not” (didn’t) ని ఉపయోగించి నకారాత్మక వాక్యాలు తయారుచేయడం Simple Past tense - Making negative sentences using did not (didn't)
   
హలో రియా, నువ్వు ఎలా ఉన్నావు ? Hello Riya, how are you? 
హలో అనుజ్, నా రోజు అంత బాగా జరగలేదు. Hello Anuj, my day did not go well.
నేను ఈరోజు స్కూలుకు వెళ్ళలేదు.  I didn’t go to school today.
ఎందుకు ? Why?
నాకు జబ్బుగా ఉండింది. I was sick.
అయ్యో ! అలానా ! Sorry to hear that!
నాకు రోజంతా కడుపు నొప్పేసింది. My stomach ached throughout the day.
అంటే నువ్వు బయట ఎదో తిన్నావన్న మాట ! That means you ate something from outside. 
లేదు, నేను బయట నుంచీ ఏదీ తినలేదు ! No, I did not eat anything from outside.
సరే. నువ్వు మందులు తీసుకున్నావని అనుకుంటున్నాను. Ok. I hope you took medicines.  
నేను ఉదయం ఎలాంటి మందూ తీసుకోలేదు. I did not take any medicine in the morning. 
కానీ, సాయంత్రం ఓ డాక్టర్ దగ్గరికి వెళ్లాను. But I went to a doctor in the evening.
అతను నాకు కొన్ని మందులిచ్చాడు.  He gave me some medicines. 
సరే. నీ గురించి శ్రద్ధగా ఉండు అలాగే వేళకి ఆహారాన్ని తీసుకో. Ok. Take care of yourself and have your food on time.
థాంక్స్, కానీ ఈరోజంతా నాకు తినాలనిపించలేదు. Thanks but I didn’t feel like eating the whole day. 
కనీసం నేను లంచ్ కూడా తినలేదు. I didn’t even eat lunch.
అది మంచిది కాదు. That’s not right. 
నువ్వు సరిగ్గా తినాలి. You should eat properly.  
నన్ను క్షమించు. I am sorry.   
సరే. నీకు తొందరగా బాగావ్వాలి. Ok. Get well soon
థాంక్యూ. Thank you.
   
నేను అక్కడికి వెళ్ళలేదు. I didn't go there.
వాళ్ళు బజారుకి వెళ్ళలేదు. They didn't go to the market.
నేను వాకిలి తెరవలేదు. I didn't open the door.
వాళ్ళకి ఒకరికొకరు తెలియదు. They didn't know each other.
అతను/ఆమె ఇంట్లో చేసిన ఆహారాన్ని తినలేదు He/ She didn't eat homemade food.
   

No comments:

Post a Comment