Thursday, August 16, 2018

English lessons -26 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu

Telugu English
మీరు ఏమి చేస్తూ ఉండిరి? What were you doing?
Past continuous tense లో ప్రశ్నలు తయారు చేయడం Making questions in Past continuous Tense'
   
హలో రవీ Hello Ravi
హలో స్వాతి Hi Swati
నువ్వు నిన్న ఏం చేస్తూ ఉన్నావు? What were you doing yesterday?
నేను మాహాత్మా గాంధీ గురించిన ఫిల్మ్ ని చూస్తూ ఉన్నాను. I was watching a film about Mahatma Gandhi.
ఇదేదో ఆసక్తికరంగా అనిపిస్తోంది. నాకు దీని గురించి ఇంకా చెప్పు. That sounds interesting. Tell me  more about it.
   
ఆ ఫిల్మ్ అతన్ని ట్రైన్ లో నుంచీ నెట్టేసిన తరువాత దక్షిణాఫ్రికాలో చేసిన అహింసాత్మక నిరసనతో మొదలయ్యింది. The film started with his non violent protest  in South Africa after he was thrown off the train.
అతను టికెట్ లేకుండా ప్రయాణిస్తూ ఉన్నాడా ? Was he travelling without a ticket?
లేదు, అతను టికెట్ లేకుండా ప్రయాణం చేయలేదు. No, he wasn’t travelling without a ticket.
అతను ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ లో ప్రయాణిస్తుండగా, అతన్ని నెట్టివేశారు. He was thrown off as he was travelling in the First class compartment. 
భారతీయుల్ని ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్స్ లో ప్రయాణించనిచ్చేవారు కాదు.  Indians were not allowed to travel in the first class compartments.
అతను దేని పట్ల నిరసన తెలుపుతూ ఉన్నాడు ? What was he protesting against?
అతను దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారతీయుల పట్ల అమలౌతున్న అన్యాయపు చట్టాలకు నిరసన తెలియచేస్తూ ఉన్నాడు. He was protesting against the unfair laws for Indians living in South Africa. 
తరువాత, అతను భారత దేశానికి వచ్చి బ్రిటీష్ వారి నుండీ స్వాతంత్ర్యం కోసం పోరాడాడు. Later, he came to India and fought for its independence from the British.
ఇండియాలో అతనికి ఎవరు మద్దతిచ్చేవారు ? Who were supporting him in India?
లాక్షలాది మంది భారతీయులు అతనికి మద్దతిచ్చేవారు మరియు ఎంతో పోరాటం తరువాత, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. Millions of Indians were supporting him and after a lot of struggle, India got independence. 
కానీ అతను 1948లో హత్య గావించబడ్డాడు. He was assassinated in 1948.
అతన్ని హతమారుస్తున్న సమయంలో అతను ఏం చేస్తూ ఉన్నాడు ? What was he doing when he was assassinated?
అతను తన సాయంత్రపు ప్రార్థన తరువాత అతని అనుచరుల్ని కలవడానికి వెళుతూ ఉన్నాడు. He was going to meet his followers after the evening prayer.
ఆ ఫిల్మ్ చాలా ఆసక్తికరమైనది. The film is quite interesting.
నేను దాన్ని చూడాలి.   I should watch it.
   
విషయాన్ని అర్థం చేసుకోవడం UNDERSTANDING CONCEPTS
Past Continuous Tense లో ప్రశ్నలు తయారు చేయడం Making questions in "Past continuous tense"
Past Continuous Tense లో  ‘was’/ ‘were’ మరియు ‘WH words’లని ఉపయోగించి ప్రశ్నలు తయారు చేయవచ్చు. Questions can be formed in the Past Continuous Tense by using ‘was’/ ‘were’ and ‘WH words’. 
Past Continuous Tense లో నకారాత్మక ప్రశ్నలు తయారు చేయటానికి ‘was’/ ‘were’ ల తరువాత ‘not’ ని కలుపుతాం – was not (wasn’t), were not (weren’t). ‘Not’ is added after ‘was’/ ‘were’ to form negative questions in the Past Continuous Tense – was not (wasn’t), were not (weren’t). 
Past Continuous Tense లో సకారాత్మక నకారాత్మక ప్రశ్నలు తయారు చేయడానికి ‘was’ మరియు ‘were’ లని ప్రయోగించాలి  Making Positive and Negative Questions with ‘was’ and ‘were’ in Past Continuous Tense
అతను ఫుట్ బాల్ ఆడుతూ ఉన్నాడా ? Was he playing football?
వాళ్ళు ఉదయం చదువుతూ ఉన్నారా ? Were they studying in the morning?
ఆమె అతనితో మాట్లాడుటూ ఉంది కదా ? wasn't she talking to him/ her?
వాళ్ళు మ్యాచ్ చూస్తూ ఉండలేదా ? Weren't they watching the match?
Past Continuous Tense  ‘WH Words’ని ఉపయోగించి సకారాత్మక మరియు నకారాత్మక వాక్యాలను తయారు చేయడం Making Positive and Negative Sentences in Past Continuous Tense  using ‘WH Words'
అతను అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు ? What was he doing there?
వాళ్ళు ఎక్కడికి పోతూ ఉన్నిన్నారు Where were they going?
వాళ్ళు ఎప్పుడు వస్తూ ఉన్నారు ? When were they coming?
ఆమె అక్కడ ఎలా ఎలా పనిచేస్తూ ఉండేది ? How was she working there?
వాళ్ళు కాలేజికి ఎందుకు వెళ్ళేవారు కాదు ? Why weren't they going to the college?
ఎవరు పాట పడుతూ ఉండలేదు ? Who wasn't singing the song?
   
రవి స్కూలుకు వెళుతూ ఉన్నాడా ? Was Ravi going to the school?
వాళ్ళు అక్కడ ఎందుకు కూర్చుండే వాళ్ళు ? Why were they sitting there?
నువ్వు అతనితో మాట్లాడుతూ ఉన్నావా ? Were you talking to him?
పిల్లలు రోడ్డు మీద ఆడుతూ ఉన్నారా ? Were the children playing on the road?
వాళ్ళు అక్కడికి ఎందుకు వెళుతూ ఉన్నారు ? Why were they going?
   
వాళ్ళు స్కూలు వెళుతూ ఉన్నారా ? Were they going to the school?
అతను అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు ? What was he doing there?
వాళ్ళు ఎక్కడికి వెళుతూ ఉన్నారు ? Where were they going?
అతను తింటూ ఉన్నారా ? Was he eating?
నువ్వు అక్కడికి ఎందుకు వెళుతూ ఉన్నావు ? Why were you going there?
   

No comments:

Post a Comment