Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Thursday, August 16, 2018
English lessons -30 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu
Telugu | English |
రెస్టారెంట్లో ఆర్డర్ ఇవ్వడం | Placing order at a restaurant |
‘Would you', ‘Could you', ‘May I', 'could you' మరియు ‘I would’ లను ప్రయోగించడం | Usage of ‘Would you’, ‘could you’, ‘may I’ and ‘I would’ |
హలో, ఇది కింగ్స్ బర్గరా ? | Hello, is this King’s Burger? |
అవును, మీరు ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నారా ? | Yes, would you like to place an order? |
అవును, నాకు రెండు వెజిటేరియన్ బర్గర్స్ ఇంకా ఒక కోక్ కావాలి. | Yes, I would like to have two vegetarian burgers and one Coke. |
మీరు బర్గర్స్ కి ఎక్స్ ట్రా ఛీజ్ కలపాలనుకుంటున్నారా ? | Could you add extra cheese to the burgers? |
అవును, తప్పకుండా. | Yes, sure. |
మీరు మా కొత్త జంబో బర్గర్ ట్రై చేయాలనుకుంటున్నారా ? | Would you like to try our new Jumbo burger? |
లేదు, థాంక్స్. | No, thanks. |
మీ ఫోన్ నెంబర్ ఇస్తారా, ప్లీజ్ ? | May I have your phone number please? |
అది 0944983298. |
It is 0944983298. |
మేడం, మీ అడ్రస్ హౌస్ నెంబర్ 321, సెక్టార్ 16 ఆ ? | Madam, is your address house number 321 sector 16? |
అవును, అది కరెక్ట్. | Yes, that’s right. |
మీ ఆర్డర్ మీకు 30 నిమిషాల్లో అందుతుంది. | Your order will be delivered in 30 minutes. |
కింగ్స్ బర్గర్ కి కాల్ చేసినందుకు థాంక్యూ. | Thank you for calling King’s Burger. |
విషయాలను అర్థం చేసుకోవడం | UNDERSTANDING CONCEPTS |
వినయపూర్వకంగా ప్రశ్నలు అడగటం | To ask questions politely |
మీ ముందున్న వ్యక్తిని మర్యాదగా ఏదైనా అడగాలనుకుంటే, అప్పుడు మీరు ‘Would you’, ‘Could you’, ‘May I’ లని వాడతారు. | When you want to politely ask something from the opposite
person, then you use ‘Would you’, ‘Could you’, ‘May I’. |
ప్రశ్నలు | Questions |
మీరు నాకు సాయం చేస్తారా ? | Could you help me please? |
మీరు, నీళ్ళు తీసుకుంటారా ? | Would you like to drink water? |
మీరు టీ తీసుకుంటారా ? | Would you like to have tea? |
మీ టికెట్ నేను చూడచ్చా ? | May I have your ticket please? |
మీరు ఎదుటి వ్యక్తితో మర్యాదగా ఏదైనా అడగాలనుకున్నప్పుడు ‘I would like’ ని ప్రయోగిస్తాం | When you want to politely request the opposite person, then you
use ‘I would like’. |
నేను ఇంట్లో భోంచేయాలనుకుంటున్నాను. | I would like to eat at home. |
నేను సౌత్ ఇండియన్ ఆహారాన్ని తినాలనుకుంటున్నాను. | I would like to eat South Indian. |
నేను ఎనిమిదింటికి తినాలనుకుంటున్నాను. | I would like to eat at eight. |
నేను కాఫీ తాగాలనుకుంటున్నాను. | I would like to have coffee. |
మీరు టీవీ చూడాలనుకుంటున్నారా ? | Would you like to watch TV? |
నేను నీళ్ళు తాగాలనుకుంటున్నాను. | I would like to have water. |
నేను మీకు సాయపడనా ? | May I help you? |
నేను పాస్తా తీసుకోవడానికి ఇష్టపడతాను. | I would like to have pasta. |
నాకు మీ ఫోన్ నెంబర్ ఇస్తారా ? | May I have your phone number? |
నాకో కప్పు కాఫీ లభిస్తుందా(ఇస్తారా) ? | Could I get a cup of coffee? |
నేను అతనితో/ఆమెతో మాట్లాడచ్చా ? | May I talk to her/ him? |
నేను సౌత్ ఇండియన్ ఆహారాన్ని తీసుకుంటాను. | I would like to have South Indian food. |
మీరు కేకు తీసుకుంటారా ? | Would you like to have cake? |
మీరు టీ తీసుకుంటారా ? | Would you like to have tea? |
English lessons -29 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu
Telugu | English |
నువ్వు వారాంతంలో ఏం చేస్తావు ? | What will you do on the weekend? |
“will” మరియు “WH words” ని ప్రయోగించి ప్రశ్నలు తయారు చేయడం | Using 'will' & 'WH words' to make questions |
నువ్వు వారాంతంలో ఏం చేస్తావు ? | What will you do on the weekend? |
నేను మా అన్నయ్యతో కలిసి మూవీ చూడ్డానికి వెళతాను. | I will go to watch a movie with my elder brother |
సరే. నువ్వు ఏ మూవీ చూస్తావు ? | Ok. Which movie will you watch? |
నేను హ్యారీ పాటర్ చూస్తాను. | I will watch Harry Potter |
నేను ఆ మూవీ చూడాలనుకుంటున్నాను. | I also want to watch that movie |
నువ్వు మాతో వస్తావా ? | Will you come with us? |
మనమంతా కలిసి వెళితే నేను చాలా సంతోషపడతాను. | I will be very happy if we all go together. |
థాంక్యూ. నువ్వు ఆదివారం వెళతావా ? | Thank you. Will you go on Sunday? |
అవును. మేము ఆదివారం వెళతాం. | Yes. We will go on Sunday. |
సరే. నేను నీతో వస్తాను. | Ok. I will come with you. |
అయితే మనం మూవీ చూడటానికి ఎక్కడికి వెళదాం ? | But where will we go to watch the movie? |
మనం సత్యం సినిమాకు వెళదాం. | We will go to Satyam Cinema. |
సరే, నిన్ను ఆదివారం కలుస్తా. | Ok, see you on Sunday. |
మనం అక్కడికి సమయానికి చేరుకుంటామా ? | Will we reach there on time? |
నేను డాక్టర్ అవుతానా ? | Will I be/ become a doctor? |
నువ్వు ఎలా వెళతావు ? | How will you go? |
మనం మూవీ ఎక్కడ చూస్తాం ? | Where will we watch the movie? |
మనం ఈ రాత్రి బయట తిందామా ? | Will we eat out tonight? |
English lessons -28 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu
Telugu | English |
సాయాన్ని అందించడం | Offering a helping hand |
will/ will not లని ప్రయోగించడం | using 'will / will not' |
నువ్వు ఏం చేస్తున్నావు ? | What are you doing? |
నేను మొక్కలను చూసుకుంటున్నాను. | I am taking care of the plants. |
సరే. నేను నీకు సాయం చేస్తాను. | Ok. I will help you. |
నేను ఇప్పుడు మొక్కలకి నీళ్ళు పోస్తాను. | I will water the plants now. |
దాన్లో నువ్వు నాకు సాయం చేయచ్చు. | You can help me with it. |
సరే. మీ గార్డెన్ లో ఏయే మొక్కలు ఉన్నాయి ? | Ok. Which plants are there in your garden? |
ఇప్పుడు నా గార్డెన్ లో గులాబీ మొక్కలు ఉన్నాయి. | There are rose plants in my garden now. |
నేను త్వరలో పొద్దుతిరుగుడు పూలను పెంచుతాను. | I will also grow sunflowers soon. |
నువ్వు పళ్ళ మొక్కలని ఎందుకు పెంచకూడదు ? | Why don’t you grow fruit trees? |
నేను పళ్ళ మొక్కలని పెంచను, ఎందుకంటే అవి పక్వం చెందడానికి చాలా ఏళ్ళు పడుతుంది. | I will not grow fruit trees because they will take many years to mature. |
నేను నా తోటలో ఒక మామిడి చెట్టును పెంచుతాను. | I will grow a mango tree in my garden. |
ఎందుకు ? | Why ? |
మామిడి నాకు అత్యంత ఇష్టమైన పండు. | Mango is my favourite fruit. |
నేనొక మామిడి చెట్టుని పెంచుతాను, దాంతో సంవత్సరమంతా మామిడిపళ్ళను తినచ్చు. | I will grow a mango tree so that I can eat mangoes throughout the year. |
నేను కూడా నీ చేట్టునుంచీ మామిడి పళ్ళు తింటాను. | I will also eat the mangoes from your tree. |
సరే, నేను ఇంటికి వెళుతున్నాను. | Fine, I am going home now. |
సరే. నేను నిన్ను స్కూలులో కలుస్తాను. | Ok. I will meet you in school tomorrow. |
మనం అక్కడికి సమయానికి చేరుకుంటాం. | We will reach there on time. |
నేనొక డాక్టర్ ని అవుతాను. | I will become a doctor. |
నేను ఈ పుస్తకాన్ని చదువుతాను. | I will read this book. |
మనమొక మూవీ చూద్దాం. | We will watch a movie. |
మనం ఈరోజు రాత్రి బయట తిందాం. | We will eat out tonight. |
English lessons -27 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu
Telugu | English |
నేను బిజీగా ఉన్నాను. | I was busy. |
Simple Past tense లేదా Past continuous tense లని ప్రయోగించడం | Using Simple past tense and Present continuous tense. |
హలో రియా, ఎలా ఉన్నావు ? | Hello Riya, how are you? |
హలో అనుజ్, నేను బాగున్నాను. | Hello Anuj, I am fine. |
నువ్వు నిన్న ఎక్కడ ఉన్నావు ? | Where were you yesterday? |
నేను నిన్న ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. | I was at a friend’s house. |
నిన్న నేను మీ ఇంటికి కాల్ చేసాను. | I called up your house yesterday. |
నువ్వు కాల్ చేసినప్పుడు నేను దారిలో ఉన్నాను. | I was on the way when you were calling me. |
నువ్వు నన్ను మొబైల్లో ఎందుకు కాల్ చేయలేదు ? | Why didn’t you call me on my mobile? |
నేను నీ మొబైల్ నెంబర్ మరిచిపోయాను. | I forgot your mobile number. |
మీ ఫ్రెండ్ ఇంటిలో ఏం చేస్తూ ఉన్నావు ? | What were you doing at your friend’s house? |
మేమిద్దరం కలిసి 'హ్యారీ పాటర్' మూవీ చూస్తూ ఉన్నాం. | We were watching the new ‘Harry Potter’ movie together. |
మేము గార్డెన్ క్రికెట్ కూడా ఆడాం. | We also played cricket in his garden. |
నువ్వు మూవీనీ మరియు క్రికెట్ నీ ఎంజాయ్ చేసావా ? | Did you enjoy the movie and the cricket? |
మూవీ చాలా బాగా ఉన్నింది. | The movie was very good. |
కానీ నేను క్రికెట్ ఆడటాన్ని ఎంజాయ్ చేయలేదు. | But I didn’t enjoy playing cricket. |
ఎందుకు ? | Why? |
మేము ఆడుతున్నప్పుడు వర్షం పడ్డం మొదలైంది. | It started to rain when we were playing. |
సరే. కానీ నీకు మూవీ నచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. | Ok. But I am happy that you liked the movie. |
అవును, అది సిరీస్లో చివరి మూవీ కూడా. | Yes, it was also the last movie of this series. |
నేను ఈ మూవీని గతవారం చూసాను, అది నాకెంతగానో నచ్చింది. | I watched this movie last week and liked it a lot. |
విషయాలను అర్థం చేసుకోవడం | UNDERSTANDING CONCEPTS |
ఇంతకు ముందు సంబాషణలో మీరు Simple Past Tense మరియు Past Continuous Tense రెండిటిలోనూ వాక్యాలు చూసారు | In the previous conversation, you heard sentences from both the Simple Past Tense and Past Continuous Tense. |
గతంలో సంభవించిన చర్యలను గురించి మాట్లాడటం కోసం Simple Past Tense ని వాడుతారు. | Simple Past Tense is used to talk about those actions that happened in the past. |
Past Continuous Tense గతంలో జరుగుతున్న సంఘటనల గురించి మాట్లాడటానికి ఉపయోగిస్తారు. | Past Continuous is used to talk about those actions that were in
progress in the past. |
మనం ఈ రెండు రూపాల్నీ (Past Continuous & Simple Past)ఒకే వాక్యంలో వాడినప్పుడు: | When we use these two forms in the same sentence, we use: |
Past Continuous : గతంలో జరుగుతూ ఉన్న చర్యల గురించి మాట్లాడటం కోసం | Past Continuous: to talk about actions that were in progress in the past. |
మరియు | and |
Simple Past : గతంలో ముగిసిపోయిన చర్యల గురించి మాట్లాడటం కోసం | Past Simple : to talk
about action that were completed in the past. |
Simple Past Tense మరియు Past Continuous Tense ల మధ్య ఉన్న తేడా | Difference between Simple Past & Past Continuous |
గతంలో సంభవించిన చర్య | action that happened in the past |
గతంలో జరుగుతూ ఉన్న చర్య | action that was in progress in the past |
నేను ఫుట్ బాల్ ఆడాను. | I played football. |
నేను ఫుట్ బాల్ ఆడుతూ ఉన్నాను. | I was playing football. |
వర్షం మొదలయ్యే సరికి నేను ఫుట్ బాల్ ఆడుతూ ఉన్నాను. | I was playing football when it started to rain. |
వాళ్ళు ఇంటికి వచ్చారు. | They came home. |
వాళ్ళు ఇంటికి వస్తూ ఉన్నారు. | They were coming home. |
నువ్వు ఇంటికి వచ్చే సరికి, నేను మూవీ చూస్తూ ఉన్నాను. | I was watching a movie when you came home. |
అతను ఆమెను కలిసాడు. | He met her. |
అతను ఆమెను కలుస్తూ ఉన్నాడు. | He was meeting her. |
నువ్వు కాల్ చేసినప్పుడు నేను స్నానం చేస్తూ ఉన్నా. | I was taking shower when you called me. |
నేను నిన్న వాచ్ కొన్నాను. | I bought a watch yesterday |
ఆమె తన ఫ్రెండ్ ఇంటి వద్ద ఉంది. | She was at her friend's house. |
ఆమె ఒక పద్యం చదువుతూ ఉన్నింది. | She was reading a poem. |
నేను ఉత్తరం రాస్తూ ఉన్నిన్నాను. | I was writing a letter. |
ఆమె నాకు ఇంగ్లీష్ మాట్లాడటం నేర్పించింది/ అతను నాకు ఇంగ్లీష్ మాట్లాడటం నేర్పించాడు | He/ she taught me to speak English. |
నేను బిజీగా ఉన్నా. | I was busy. |
నేను అక్కడ ఉన్నా. | I was there. |
వాళ్ళు హోటల్లో ఉన్నారు. | They stayed in the hotel. |
వాళ్ళు హోటల్లో ఉంటూ ఉన్నారు. | They were staying in the hotel. |
వాళ్ళు పార్కులో ఆడుతూ ఉన్నారు. | They were playing in the park. |
English lessons -26 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu
Telugu | English |
మీరు ఏమి చేస్తూ ఉండిరి? | What were you doing? |
Past continuous tense లో ప్రశ్నలు తయారు చేయడం | Making questions in Past continuous Tense' |
హలో రవీ | Hello Ravi |
హలో స్వాతి | Hi Swati |
నువ్వు నిన్న ఏం చేస్తూ ఉన్నావు? | What were you doing yesterday? |
నేను మాహాత్మా గాంధీ గురించిన ఫిల్మ్ ని చూస్తూ ఉన్నాను. | I was watching a film about Mahatma Gandhi. |
ఇదేదో ఆసక్తికరంగా అనిపిస్తోంది. నాకు దీని గురించి ఇంకా చెప్పు. | That sounds interesting. Tell me more about it. |
ఆ ఫిల్మ్ అతన్ని ట్రైన్ లో నుంచీ నెట్టేసిన తరువాత దక్షిణాఫ్రికాలో చేసిన అహింసాత్మక నిరసనతో మొదలయ్యింది. | The film started with his non violent protest in South Africa after he was thrown off the train. |
అతను టికెట్ లేకుండా ప్రయాణిస్తూ ఉన్నాడా ? | Was he travelling without a ticket? |
లేదు, అతను టికెట్ లేకుండా ప్రయాణం చేయలేదు. | No, he wasn’t travelling without a ticket. |
అతను ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ లో ప్రయాణిస్తుండగా, అతన్ని నెట్టివేశారు. | He was thrown off as he was travelling in the First class compartment. |
భారతీయుల్ని ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్స్ లో ప్రయాణించనిచ్చేవారు కాదు. | Indians were not allowed to travel in the first class compartments. |
అతను దేని పట్ల నిరసన తెలుపుతూ ఉన్నాడు ? | What was he protesting against? |
అతను దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారతీయుల పట్ల అమలౌతున్న అన్యాయపు చట్టాలకు నిరసన తెలియచేస్తూ ఉన్నాడు. | He was protesting against the unfair laws for Indians living in South Africa. |
తరువాత, అతను భారత దేశానికి వచ్చి బ్రిటీష్ వారి నుండీ స్వాతంత్ర్యం కోసం పోరాడాడు. | Later, he came to India and fought for its independence from the British. |
ఇండియాలో అతనికి ఎవరు మద్దతిచ్చేవారు ? | Who were supporting him in India? |
లాక్షలాది మంది భారతీయులు అతనికి మద్దతిచ్చేవారు మరియు ఎంతో పోరాటం తరువాత, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. | Millions of Indians were supporting him and after a lot of struggle, India got independence. |
కానీ అతను 1948లో హత్య గావించబడ్డాడు. | He was assassinated in 1948. |
అతన్ని హతమారుస్తున్న సమయంలో అతను ఏం చేస్తూ ఉన్నాడు ? | What was he doing when he was assassinated? |
అతను తన సాయంత్రపు ప్రార్థన తరువాత అతని అనుచరుల్ని కలవడానికి వెళుతూ ఉన్నాడు. | He was going to meet his followers after the evening prayer. |
ఆ ఫిల్మ్ చాలా ఆసక్తికరమైనది. | The film is quite interesting. |
నేను దాన్ని చూడాలి. | I should watch it. |
విషయాన్ని అర్థం చేసుకోవడం | UNDERSTANDING CONCEPTS |
Past Continuous Tense లో ప్రశ్నలు తయారు చేయడం | Making questions in "Past continuous tense" |
Past Continuous Tense లో ‘was’/ ‘were’ మరియు ‘WH words’లని ఉపయోగించి ప్రశ్నలు తయారు చేయవచ్చు. | Questions can be formed in the Past Continuous Tense by using ‘was’/ ‘were’ and ‘WH words’. |
Past Continuous Tense లో నకారాత్మక ప్రశ్నలు తయారు చేయటానికి ‘was’/ ‘were’ ల తరువాత ‘not’ ని కలుపుతాం – was not (wasn’t), were not (weren’t). | ‘Not’ is added after ‘was’/ ‘were’ to form negative questions in the Past Continuous Tense – was not (wasn’t), were not (weren’t). |
Past Continuous Tense లో సకారాత్మక నకారాత్మక ప్రశ్నలు తయారు చేయడానికి ‘was’ మరియు ‘were’ లని ప్రయోగించాలి | Making Positive and Negative Questions with ‘was’ and ‘were’ in Past Continuous Tense |
అతను ఫుట్ బాల్ ఆడుతూ ఉన్నాడా ? | Was he playing football? |
వాళ్ళు ఉదయం చదువుతూ ఉన్నారా ? | Were they studying in the morning? |
ఆమె అతనితో మాట్లాడుటూ ఉంది కదా ? | wasn't she talking to him/ her? |
వాళ్ళు మ్యాచ్ చూస్తూ ఉండలేదా ? | Weren't they watching the match? |
Past Continuous Tense ‘WH Words’ని ఉపయోగించి సకారాత్మక మరియు నకారాత్మక వాక్యాలను తయారు చేయడం | Making Positive and Negative Sentences in Past Continuous Tense using ‘WH Words' |
అతను అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు ? | What was he doing there? |
వాళ్ళు ఎక్కడికి పోతూ ఉన్నిన్నారు | Where were they going? |
వాళ్ళు ఎప్పుడు వస్తూ ఉన్నారు ? | When were they coming? |
ఆమె అక్కడ ఎలా ఎలా పనిచేస్తూ ఉండేది ? | How was she working there? |
వాళ్ళు కాలేజికి ఎందుకు వెళ్ళేవారు కాదు ? | Why weren't they going to the college? |
ఎవరు పాట పడుతూ ఉండలేదు ? | Who wasn't singing the song? |
రవి స్కూలుకు వెళుతూ ఉన్నాడా ? | Was Ravi going to the school? |
వాళ్ళు అక్కడ ఎందుకు కూర్చుండే వాళ్ళు ? | Why were they sitting there? |
నువ్వు అతనితో మాట్లాడుతూ ఉన్నావా ? | Were you talking to him? |
పిల్లలు రోడ్డు మీద ఆడుతూ ఉన్నారా ? | Were the children playing on the road? |
వాళ్ళు అక్కడికి ఎందుకు వెళుతూ ఉన్నారు ? | Why were they going? |
వాళ్ళు స్కూలు వెళుతూ ఉన్నారా ? | Were they going to the school? |
అతను అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు ? | What was he doing there? |
వాళ్ళు ఎక్కడికి వెళుతూ ఉన్నారు ? | Where were they going? |
అతను తింటూ ఉన్నారా ? | Was he eating? |
నువ్వు అక్కడికి ఎందుకు వెళుతూ ఉన్నావు ? | Why were you going there? |
English lessons -25 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu
Telugu | English |
నేను నిన్న క్రికెట్ మ్యాచ్ చూసాను. | I watched cricket match yesterday. |
Past continuous tenseలో వాక్యాలు తయారు చేయటం | Making sentences in 'Past Continuous tense" |
హలో రియా | Hello Riya |
హలో రవి | Hello Ravi |
నిన్న, నేను ఇండియా-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లాను. | Yesterday, I went to see the India- Australia cricket match. |
వావ్ ! నీ అనుభవం ఎలా ఉండింది ? | Wow! How was your experience? |
చాలా బాగుంది! స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోయింది. | Awesome! The stadium was packed with spectators. |
వాళ్ళు ఆటగాళ్ళని ఉత్సాహపరుస్తూనే ఉన్నారు. | They were cheering the players. |
నేను కూడా ధోని బౌండరీలు కొట్టినప్పుడు ఉత్సాహపరిచాను. | I was also cheering for Dhoni when he was hitting boundaries |
లాస్ట్ ఓవర్ లోని ప్రతీ రన్ కు డ్రమ్మర్ డ్రం కొడుతూ ఉంటే, ప్రేక్షకులు డ్యాన్స్ చేసారు. | The drummer was playing drums on every run in the last over and the audience was dancing |
కొందరు ఆస్ట్రేలియన్స్ నా పక్కనే కూర్చొన్నారు | Some Australians were sitting next to me. |
ఇండియా లక్ష్యాన్ని చేధిస్తోంటే, వాళ్ళు నెర్వస్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. | They were feeling nervous when India was chasing the target. |
చివరికి, ఇండియా మ్యాచ్ గెలిచింది. | India won the match in the end. |
అక్కడ నీకు నచ్చనిది ఏదైనా ఉందా ? | Was there something you did not like? |
అవును, నాకు కొంత మంది చెత్తపారేయడం నచ్చలేదు. | Yes, I did not like some people who were littering around. |
అంతే కాదు, స్టాల్స్ లో ఆహారాన్ని చాలా ఎక్కువ ధరలకు అమ్మారు. | Also, the food at the stalls was being sold at very high rates. |
రియా, ఈ మ్యాచ్ నువ్వు చూడలేదా ? | Didn’t you watch this match, Riya? |
లేదు, నేనప్పుడు నిద్రపోతున్నా. | No, I was sleeping at that time. |
విషయాల్ని అవగాహన చేసుకోవడం | UNDERSTANDING CONCEPTS |
Past Continuous Tense | Past Continuous Tense |
Past Continuous Tense ని గతంలో జరుగుతూ ఉండిన చర్య గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు. | The Past Continuous is used to talk about an action going on in the past. |
ఉదాహరణకి ఎవరైనా నిన్ను నిన్న నువ్వు ఏం చేస్తూ ఉండావు అన్నదానికి Past Continuous Tense ని ఉపయోగించి జవాబు ఇస్తాం. | For example, if someone asks you what you were doing yesterday, then you will answer using Past Continuous Tense |
ఇక్కడ, చర్య యొక్క కాలాన్ని సూచించాల్సిన అవసరం లేదు. | It is not necessary to mention the time of action here. |
సకారాత్మక వాక్యాలని తయారు చేయడం. | Making positive sentences |
కర్త | Doer |
క్రియ | Verb |
మిగిలిన వాక్యం | Remaining sentence |
అర్థం | Meaning |
నేను ఫుట్ బాల్ ఆడుతూ ఉన్నా. | I was playing football |
ఆమె ఫుట్ బాల ఆడుతోండింది. | She was playing football |
అతను ఫుట్ బాల్ ఆడుతూ ఉన్నాడు. | He was playing football |
నువ్వు ఫుట్ బాల్ ఆడుతూ ఉన్నావు. | You were playing football |
వాళ్ళు ఫుట్ బాల్ ఆడుతూ ఉన్నారు. | They were playing football |
మేము ఫుట్ బాల్ ఆడుతూ ఉన్నాం. | We were playing football |
నకారాత్మక వాక్యాలను తయారుచేయడం | Making negative sentences |
నేను ఫుట్ బాల్ ఆడుతూ ఉండలేదు. | I wasn't playing football |
ఆమె ఫుట్ బాల ఆడుతూ ఉండలేదు. | She wasn't playing football |
అతను ఫుట్ బాల్ ఆడుతూ ఉండలేదు. | He wasn't playing football |
నువ్వు ఫుట్ బాల్ ఆడుతూ ఉండలేదు. | You weren't playing football |
వాళ్ళు ఫుట్ బాల్ ఆడుతూ ఉండలేదు. | They weren't playing football |
మేము ఫుట్ బాల్ ఆడుతూ ఉండలేదు. | We weren't playing football |
రవి క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నాడు. | Ravi was watching the cricket match. |
అతని తల్లి నిద్రపోతూ ఉంది. | His mother was sleeping. |
నిన్న వాన పడుతూ ఉండింది. | It was raining yesterday. |
వాళ్ళు గుడికి వెళుతూ ఉన్నారు. | They were going to the temple. |
మేము మీతా కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. | We were waiting for Meeta. |
నువ్వు పార్కులో ఆడుతూ ఉన్నావు. | You were playing in the park. |
రవి క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉండలేదు. | Ravi wasn't watching the cricket match. |
అతని తల్లి నిద్రపోతూ ఉండలేదు. | His mother wasn't sleeping. |
నిన్న వాన పడుతూ ఉండలేదు. | It wasn't raining yesterday. |
వాళ్ళు గుడికి వెళుతూ ఉండలేదు. | They weren't going to the temple. |
మేము మీతా కోసం ఆడుతూ ఉండలేదు. | We weren't waiting for Meeta. |
మీరు పార్కులో ఆడుతూ ఉండలేదు. | You weren't playing in the park. |
రవి స్కూలుకి వెళుతూ ఉన్నాడు. | Ravi was going to school. |
రోసీ పుస్తకం చదువుతూ ఉన్నాడు. | Rosy was reading the book. |
మేము సినిమా చూస్తూ ఉన్నాం. | We were watching the movie. |
నువ్వు అతనితో మాట్లాడుతూ ఉండలేదు. | You weren't talking to him. |
పిల్లలు వీధిలో ఆడుతూ ఉండలేదు. | The children weren't playing on the street. |
వాళ్ళు ఎక్కడకీ వెళ్తూ ఉండలేదు. | They weren't going anywhere. |
కునాల్ స్కూలుకి వెళుతూ ఉన్నాడు. | Kunal was going to the school. |
మీతా కార్ డ్రైవ్ చేస్తూ లేదు. | Meeta wasn't driving the car. |
మేము పడుకోబోతూ ఉన్నాం. | We were going to sleep. |
ఎవరో డోర్ తడుతూ ఉన్నారు. | Someone was knocking at the door. |
పిల్లలు చదువుతూ ఉండలేదు. | The children weren't studying |
Subscribe to:
Posts (Atom)