Telugu | English |
మీ పోటీ ఎప్పుడు ? | When is your competition? |
సమయం గురించి మాట్లాడేటప్పుడు 'in,at,on' లాంటి పదాలను ఉపయోగించడం | Usage of the words used while talking about time like 'in, at, on' |
హాయ్ అనుజ్, ఈ రోజుల్లో నువ్వు ఏం చేస్తున్నావు ? | Hi Anuj, what are you doing these days? |
నేను ఈ రోజుల్లో ఒక పోటీ కోసం డ్యాన్స్ నేర్చుకుంటున్నాను | I am learning dance for a competition these days. |
మీ క్లాసులు ఎప్పుడుంటాయి ? | When are your classes? |
క్లాసులు శనివారాలు మరియు ఆదివారాలు ఉంటాయి. | The classes are on Saturdays and Sundays. |
మీ పోటీ ఎప్పుడు ? | When is your competition? |
పోటీ డిసెంబర్ 12 న. | The competition is on December 12. |
నువ్వు క్లాసులకి ఏ టైంలో వెళతావు ? | What time do you go for classes? |
నేను క్లాసులకి సాయంత్రం 6 గంటలకి వెళతాను. | I go for classes at 6 in the evening. |
మరి నువ్వు ఎప్పుడు చదువుకుంటావు? | When do you study then? |
నేను రాత్రిపూట చదువుతాను. | I study at night. |
నువ్వు ఎప్పుడు నిద్రపోతావు ? | When do you sleep? |
నేను రాత్రి 12 కు నిద్రపోతాను. | I sleep at 12 at night. |
విషయాల్ని అవగాహన చేసుకోవడం | UNDERSTANDING CONCEPTS |
Preposition | Preposition |
ఇంగ్లీష్ వ్యాకరణంలో , 'Preposition' అనేది నామవాచకం(noun) ముందు కానీ, సర్వనామం(pronoun) ముందు కానీ వస్తుంది మరియు అది ఒక ఒక పదాన్ని మరో పదంతో కలుపుతుంది. | In English grammar, preposition is a word that comes before a noun or a pronoun and connects one word with the other. |
Prepositions of time | Prepositions of time |
Preposition of time అనేది ఒక సంఘటన జరిగినప్పుడు దాని సమయం గురించి మాట్లాడటానికి ఉపయోగించేది. | Prepositions of time is used to talk about the time when an actions happens. In, at, on are commonly used prepositions of time |
in, at, on లను ప్రయోగించడం | Use of in, at, on |
In ని ప్రయోగించడం | Use of 'in' |
మనం ‘in’ ని దేనికి ఉపయోగిస్తామంటే : | We use ‘in’ for: |
నెలలకు | Months |
సంవత్సరాలకు | Years |
రోజులోని సమయానికి | Time of the day |
ఋతువులకు | sesasons |
At ని ప్రయోగించడం | Use of at |
మనం 'at' ని కచ్చితమైన సమయం గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తాం. ( at half past ten, at nine) | We use ‘at’ when we talk about precise time. (at half past ten, at nine) |
గుర్తుంచుకోండి, మనం ‘night’ తో ఎప్పుడూ ‘at’ నే ఉపయోగిస్తాం | Remember that with ‘night’ we always use ‘at’. |
On ని ఉపయోగించడం | Use of on |
ఒక ప్రత్యేకమైన రోజు గురించి కానీ, తేదీ గురించి మాట్లాడేటప్పుడు మనం 'on' ని ఉపయోగిస్తాం | We use ‘on’ when we talk about a particular day or date. |
షో ఎనిమిదింటికి మొదలవుతుంది. | The show starts at eight. |
ఆదివారమే నా పుట్టినరోజు. | My birthday is on Sunday. |
మేము ఉదయాన్నే ఆడుతాం. | We play in the morning. |
సంగీత కచేరి జూన్లో (ఉంటుంది). | The music concert is in June. |
పెళ్లి మార్చ్ 12 న (జరుగుతుంది). | The wedding is on March 12. |
భారత్ దాని స్వాతంత్ర దినాన్ని ఆగస్ట్ 15 న జరుపుకుంటుంది. | India celebrates its Independence Day on August 15. |
గాంధీజీ పుట్టినరోజు అక్టోబర్లో. | Gandhiji’s birthday is in October. |
నేను ఉదయం ఆరింటికి వాక్ కు వెళతాను. | I go for a walk at six in the morning. |
పెయింటింగ్ క్లాస్ శనివారం రోజున ఉంటుంది. | Painting class is on Saturday. |
నేను రాత్రి భోజనం తరువాత వాక్ కు వెళతాను. | I go for a walk after dinner. |
డ్యాన్స్ క్లాస్ సాయంత్రం ఉంది. | The dance class is in the evening. |
నేను వేసవిలో మనాలికి వెళతాను. | I go to Manali in summer. |
నేను పది గంటలకి నిద్రపోతాను. | I go to sleep at ten. |
పరీక్ష సోమవారాన ఉంది. | The exam is on Monday. |
హోలీ మార్చ్ 27న. | Holi is on 27th March. |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Thursday, August 16, 2018
English lessons -14 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment