Thursday, August 16, 2018

English lessons -16 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu

Telugu English
మీ దుకాణం ఎక్కడుంది ? Where is your shop?
దిక్కుల గురించి చెప్పేటప్పుడు 'Behind, next to, in front of, opposite, between, across మరియు near' లని ఉపయోగిస్తాం The words used to tell direction like Behind, next to, in front of, opposite, between, across and near
   
హాయ్ అనుజ్, నువ్వెక్కడున్నావు ? Hi Anuj, where are you?
నేను మా షాప్ దగ్గర ఉన్నాను.  I’m at my shop.
నేను నిన్ను కలవాలని అనుకుంటున్నాను. I want to meet you.
మీ కొత్త షాప్ లొకేషన్ గురించి చెప్తావా ?  Can you tell me the location of your new shop?
తప్పకుండా. మా కొత్త షాప్ మార్కెట్ దగ్గర ఉంది. Sure. My new shop is near the market. 
మీ షాప్ సెంట్రల్ పార్క్ కు పక్కన ఉందా ? Is your shop next to the Central Park?
లేదు, సెంట్రల్ పార్క్ షాప్ వెనకల ఉంది. No, the Central Park is behind the shop. 
షాప్ డాన్ బాస్కో స్కూలుకి ఎదురుగా ఉంది. The shop is right opposite the Don Bosco School.
నా షాప్ బొమ్మల దుకాణానికి రెస్టారెంట్ కీ మధ్యలో ఉంది.  My shop is between a toy store and a restaurant. 
షాప్ ముందర పుస్తకాలు అమ్మే అతను కూర్చొని ఉంటాడు. There is also a book vendor sitting in front of the shop.
నాకు డైరెక్షన్స్ చెప్పినందుకు థాంక్స్.  Thanks for telling me the directions.  
   
విషయాలని అవగాహన చేసుకోవడం UNDERSTANDING CONCEPTS
Prepositions Prepositions
Prepositions of direction ని ఏదైనా ప్రదేశానికి డైరెక్షన్స్ ని చెప్పడానికి ఉపయోగిస్తారు. Prepositions of direction are used to tell the direction of a place. 
ఇంతవరకు మనం కింద ఇచ్చిన 'prepositions of direction' ని నేర్చుకున్నాం. ఇది పూర్తి పట్టిక కాదు. Till now we have learned following prepositions of direction. This is not the complete list.
Prepositions of direction మరియు వాటి అర్థాలు Prepositions of Direction and their meanings 
దగ్గర Near 
పక్కనే/ఆనుకొని Next to
వెనుకల  Behind
ఎదురుగా Opposite 
మధ్యలో Between
ముందర In front of 
కేఫ్ కాఫీ డే మీ ఇంటి దగ్గర ఉంది. Cafe Coffee Day is near my house.
ఏటీఎం మా ఆఫీసుకు పక్కనే ఉంది. ATM is next to my office.
స్కూలు మా ఇంటి వెనకల ఉంది. The school is behind my house.
స్కూలుకు ఎదురుగా గుడి ఉంది. There is a temple opposite the school.
మా స్కూలు మార్కెట్ కీ, బ్రిడ్జ్ కీ మధ్యలో ఉంది. Our school is between the market and the bridge.
మా ఇంటి ముందర మామిడి చెట్టుంది. There is a mango tree in front of the house.
   
మా ఇల్లు గుడి దగ్గర ఉంది. My house is near the temple.
పార్కుకు ఎదురుగా మార్కెట్ ఉంది. There is a market opposite the park.
మా ఇంటి వెనకల అనాధాశ్రమం ఉంది. There is an orphanage behind our house. 
మా ఆఫీసుకు పక్కనే బ్యాంక్ ఉంది. There is a bank next to our office. 
మా కాలేజ్ రెండు స్కూల్స్ కు మధ్యన ఉంది. My college is between the two schools.
   
మా ఇల్లు మార్కెట్ కు వెనకల ఉంది. Our house is behind the market.
మా స్కూలు రెండు ఇళ్ళకు మధ్యన ఉంది. My school is between two houses.
బస్టాప్ మా ఇంటి దగ్గరే ఉంది. The bus stop is near my house.
మా ఆఫీస్ దగ్గరొక స్కూలుంది. There is a school near my office.
మా ఇంటి ముందరొక బ్యాంక్ ఉంది. There's a bank in front of my house.
   

No comments:

Post a Comment