Telugu | English |
ప్రదేశాన్ని వర్ణించడం | Describing a place |
‘There is, There are , It has' లని ఉపయోగించడం | Using "There is, There are , It has". |
మీరు ఎక్కడ పని చేస్తారు ? | Where do you work? |
నేను సిటీ హాస్పిటల్లో పనిచేస్తాను. | I work at ‘City Hospital’. |
అది పెద్ద హాస్పిటలా ? | Is it a big hospital? |
అవును, అక్కడ 200 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. | Yes, there are more than 200 employees. |
అక్కడ 30 డాక్టర్లు మరియు 15 సర్జన్లు ఉన్నారు. | There are 30 doctors and 15 surgeons. |
రోగులకిచ్చే సౌకర్యాలు ఏవి ? | What facilities are given to the patients? |
అక్కడ రోగుల సహాయం కోసం 10 కౌంటర్లతో పెద్ద రిసెప్షన్ ఏరియా ఉంది. | There is a huge reception area with 10 counters to help patients. |
దానికి 100 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. | It has a seating capacity of over 100 people. |
మీ హాస్పిటల్ గురించి మరింత చెప్పండి. | Tell me more about your hospital. |
దాన్లో పది ఆపరేషన్ థియేటర్లు, అధునాతన సామాగ్రితో 5 ల్యాబొరేటరీలు ఉన్నాయి. | It has 10 operation theatres and 5 laboratories with the latest equipment. |
అక్కడ పెద్ద వార్డులున్నాయి. | There are large wards. |
ప్రతీ ఫ్లోర్ లోనూ ఒక టీవీ ఉన్న వెయిటింగ్ రూమ్ ఉంది. | There is a waiting room on every floor with a television. |
గ్రౌండ్ ఫ్లోర్ లో పెద్ద క్యాంటీన్ ఉంది. | There is a large canteen on the ground floor. |
నాకు అక్కడ పనిచేయడం ఇష్టం. | I like working there. |
విషయాలని అర్థం చేసుకోవడం | UNDERSTANDING CONCEPTS |
There is’, ‘there are’ మరియు ‘It has’ లు వర్తమాన కాలంలో సకారాత్మక పదాలు. | ‘There is’, ‘there are’ and ‘It has’ are the positive words in Present Tense. |
దీన్ని కేవలం ఒక వస్తువుని ప్రస్తావించడానికే ఉపయోగిస్తారు. | It is used to refer to only one object . |
దీన్ని కేవలం ఏకవచనంతో మాత్రమే ఉపయోగిస్తారు. | It is used with singulars (only one) only. |
దీన్ని రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువుల్ని ప్రస్తావించడానికి ఉపయోగిస్తారు. | It is used to refer to two or more objects. |
దీన్ని కేవలం బహువచనంతో మాత్రమే ఉపయోగిస్తారు. | It is used with plurals only. |
దీన్ని ఇంతకు ముందే పరిచయం చేసినవాటిని గురించి మాట్లాడ్డానికి ఉపయోగిస్తారు. | It is used to talk about something which we have introduced earlier |
దీన్ని ఏకవచనం మరియు బహువచనం, రెండిటితో ఉపయోగిస్తారు. | It is used with both singulars and plurals. |
ఉదాహరణలు | Examples |
అక్కడో ఇల్లుంది. | There is a house. |
అక్కడ చాలా ఇళ్ళున్నాయి. | There are many houses. |
ఇది నా ఇల్లు. దీనికి చాలా గదులున్నాయి. దీనికో గార్డెన్ కూడా ఉంది. | This is my house. It has many rooms. It has a garden. |
అక్కడో పుస్తకముంది. | There is a book. |
అక్కడ ఐదు పుస్తకాలున్నాయి. | There are five books. |
ఇదొక కథల పుస్తకం. దీన్లో చాలా ఆసక్తికరమైన కథలున్నాయి. | This is a story book. It has many interesting stories. |
ఇంగ్లీష్ లోకి అనువదించండి. | TRANSLATE TO ENGLISH |
సరైన ఇంగ్లీష్ అనువాదాన్ని ఎంచుకోండి. | Choose the correct ENGLISH translation |
ప్రశ్నలు మరియ జవాబులు | Question and Answers |
ఫ్రిడ్జ్ లో వెన్న ఉంది. | There is butter in the fridge. |
సంచిలో బట్టలున్నాయి. | There are clothes in the bag. |
ఆమె/అతని ఇల్లు చాలా పెద్దది. దానికి చాలా గదులున్నాయి. | Her/ His house is very big. It has many rooms. |
ఇదొక పెద్ద భవనం. ఇందులో చాలా ఆఫీసులున్నాయి. | It is a big building. It has many offices |
ఒక సంవత్సరానికి 52 వారాలున్నాయి. | There are 52 weeks in a year. |
ఇంటి ముందరొక కారుంది. | There is a car in front of the house. |
నా గదిలో కంప్యూటర్ ఉంది. | There's a computer in my room. |
సీసాలో నీళ్ళు లేవు. | There's no water in the bottle. |
ఇది అన్నిటికంటే పొడవైన భవనం. దీనికి 30 అంతస్తులున్నాయి. | This is the tallest building. It has 30 floors. |
మా ఇంట్లో ఐదు గదులున్నాయి. | There are five rooms in my house. |
ఇది మా స్కూలు. దీనికి పెద్ద ఆట స్థలం ఉంది. | This is my school. It has a big playground. |
టేబుల్ మీద ఐదు పుస్తకాలున్నాయి. | There are five books on the table. |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Thursday, August 16, 2018
English lessons -5 Learn English Speaking Through Telugu Language, Free online spoken english course in Telugu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment