Monday, August 13, 2018

Learn English to Telugu

TELUGU ENGLISH
నేను ముంబైలో ఉంటాను.  I live in Mumbai.
నేను మాడ్రన్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. I study in Modern Public School.
రాకేష్ ఒక ప్రొఫెసర్. అతను గణితం భోదిస్తాడు. Rakesh is a professor. He teaches Maths.
ప్రియ ఒక గృహిణి. ఆమె పూణేలో నివిసిస్తోంది. Priya is a homemaker. She lives in Pune.
స్నేహ గాయని కాదు.  Sneha is not a singer.
వాళ్ళు సంతోషంగా లేరు.  They are not happy.
రాహుల్ వాలీబాల్ ని ఆడడు. Rahul doesn’t play volleyball. 
అతని ప్రవర్తన నాకు నచ్చదు. I don’t like his behaviour.
ఇది నీ ఇల్లేనా ? Is this your house?
వాళ్ళు నీ/మీ అతిథులా ? Are they your guests?
ఈ ట్రైన్ జైపూర్ కి వెళుతుందా ? Does this train go to Jaipur? 
నీకు/మీకు అమిత్ తెలుసా ? Do you know Amit? 
మీ/నీ పేరేంటి ? What is your name?
ఆ మనిషెవరు ? Who is that man?
అతను కాలేజికి ఎప్పుడెళతాడు ? When does he go to college?
నువ్వెక్కడుంటావ్ ? Where do you live?
అతనెప్పుడూ ఆలస్యంగా వస్తాడు. He always comes late.
నేను అక్కడికి ఎప్పుడూ వెళ్ళను. I never go there.
ఈశా బయట ఆడుకుంటోంది. Isha is playing outside. 
మా చెల్లెలు/అక్క చదువుకుంటోంది. My sister is studying.
అతను నాతో ఆడటం లేదు ? He is not playing with me.
ఆమె పాడటం లేదు.  She is not singing.
పిల్లలు గోల చేస్తున్నారా ? Are the children making noise?
అతను చదువుతున్నాడా ? Is he studying?
నువ్వు ఏం చేస్తున్నావ్ ?/ మీరు ఏం చేస్తున్నారు ? What are you doing?
నువ్వు ఎక్కడికి వెళుతున్నావ్?/ మీరు ఎక్కడికి వెళుతున్నారు ? Where are you going?
టైం చెప్పండి - 2:15 Tell the time - 2:15
టైం చెప్పండి - 2:45 Tell the time - 2:45
అతను కుర్చీ మీద కూర్చున్నాడు.  He is sitting on the chair.
విమానం ఆకాశంలో ఎగురుతోంది. The plane is flying in the sky.
అతని ఇల్లు నా ఇంటికన్నా చిన్నది. His house is smaller than my house.
ప్రియ సోనియా కన్నా అందంగా ఉంటుంది. Priya is more beautiful than Sonia.
గులాబీ అన్నిటికంటే అందమైన పువ్వు. Rose is the most beautiful flower.
బృహస్పతి అతి పెద్ద గ్రహం. Jupiter is the biggest planet.
బుట్టలో చాలా మామిడి పళ్ళున్నాయి. There are many mangoes in the basket
నా దగ్గర పెద్ద సమాచారమేమి లేదు. I don’t have much information.
అతని ఇల్లు శుభ్రంగా ఉన్నింది. His house was very clean.
ఈ పుస్తకాలు దొరకేవి కావు. These books were not available.
సుష్మిత తలుపు తీసింది. Sushmita opened the door.
మేము ఫుట్ బాల్ ఆడాం. We played football.
నేను నిన్న పార్కుకు వెళ్లాను. I went to the park yesterday.
వాళ్ళు కుర్చీ మీద కూర్చున్నారు. They sat on the chair.
నేను నిన్న ఫుట్ బాల్ ఆడలేదు. I did not play football yesterday.
నేను అక్కడికి వెళ్ళలేదు. I did not go there.
వాళ్ళు పార్కులో ఉన్నిన్నారా ? Were they in the park?
వాతావరణం చల్లగా ఉన్నిందా ? Was the weather cold?
నువ్వేదైనా తిన్నావా ? Did you eat something?
అతను నీ/మీ పుస్తకాలను వాపసిచ్చేసాడా ? Did he return your books?
అతను ఎక్కడికి వెళ్ళాడు ? Where did he go?
రవి ఎప్పుడొచ్చాడు ? When did Ravi come?
నేను రేపు క్రికెట్ ఆడుతాను. I will play cricket tomorrow.
నేను పొద్దున్నే ఇంగ్లీష్ చదువుతాను. I will study English in the morning.
అతను ఈ  రోజు రాడు. He will not come today.
నేను రేపు ఆగ్రాకు వెళ్ళను. I will not go to Agra tomorrow.
శీతల్ ఈ రోజు ఇంటికొస్తుందా ? Will Sheetal come home today?
మనం గణితం చదువుతామా? Will we study Maths?
నువ్వు స్కూలుకు ఎప్పుడెళతావ్ ? When will you go to school?
నువ్వు రేపు ఏం చేస్తావ్? / మీరు రేపు ఏం చేస్తారు ? What will you do tomorrow?
ఈ ఇల్లు నాది.  This house is mine.
ఈ బ్యాగ్ అతనిది.  This bag is his.

No comments:

Post a Comment